Shopping Cart 0 items - $0.00 0

విజేత

 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత  హృద్యమైన చిత్రం ‘విజేత’. చిరంజీవి నటజీవితానికి ఈ చిత్రం ఒక కలికితురాయి అని చెప్పాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1985, అక్టోబర్ 23న విడుదలై.. వసూళ్ళ వర్షం కురిపించింది. భానుప్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో  సోమయాజులు, శారద, రంగనాథ్, నూతన్ ప్రసాద్ , ప్రసాద్ బాబు, శుభ, సత్యనారాయణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  ఇంటి బాధ్యతను తానొక్కడే మోస్తున్న తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో .. తన కిడ్నీని దానం చేసి.. ఆ డబ్బుతో తన చెల్లెలి పెళ్లి చేసిన  ఒక అన్న , ఒక కొడుకు  విజేతగా ఎలా మారాడు అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందింది. నిజానికి ఈ సినిమా 1981 లో విడుదలైన బెంగాలీ ఫిల్మ్ సాహెబ్ చిత్రానికి రీమేక్ వెర్షన్ . ఇదే సినిమా ఆ తర్వాత బాలీవుడ్ లో అనిల్ కపూర్ హీరోగా సాహెబ్ గానూ, కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా కర్ణగానూ, శంకర్ హీరోగా మలయాళంలో చెక్కేరన్ ఒరు చిల్ల గానూ రీమేక్ అయి ఆయాభాషల్లో కూడా సూపర్ హిట్టయింది.

Leave a comment

error: Content is protected !!