జీవితంలో మనం ఎదగడానికి సాయపడిన వారిని మనం ఎన్నటికీ మరిచిపోకూడదు. చిరకాలం వారి పట్ల కృతజ్ఞత చూపడం మన ధర్మం. విజయా ప్రొడక్షన్స్ వారి మీద చాలా మంది నటీనటులకు అలాంటి కృతజ్ఞతా భావమే ఉంది. విజయ సంస్థ లో పనిచేసిన వారు, ఆ సంస్థ నుంచి వచ్చి పేరు తెచ్చుకున్నవారూ సంస్థ మీద ఉన్న గౌరవంతో, ఆ పేరు కలుపుకున్నారు. చాలా కాలం విజయ ఆర్కెస్ట్రాలో ఉండి, సంగీత దర్శకులైన కృష్ణమూర్తి – విజయా కృష్ణమూర్తిగా స్థిరపడ్డారు. ఘంటసాల తనకి మొదటి సంతానానికి ‘విజయ కుమార్‌’ అని నామకరణం చేశారు. యస్‌.వి.రంగారావు తన సొంత ఇంటికి ‘విజయ’ అని పేరు పెట్టుకున్నారు. సావిత్రి తన కుమార్తెకి ‘విజయ చాముండేశ్వరి’ అని పేరు పెట్టింది. రంగస్థల నటుడు వడ్లమాని విశ్వనాథం తొలిసారిగా విజయవారి ‘పాతాళభైరవి’లో నటించినప్పుడు కొడుకు పుడితే, విజయ ప్రసాద్‌ – అని పేరు పెట్టారు. (అతనే తరువాత విజ్జిబాబుగా మారి చిత్రాల్లో నటించారు. జంధ్యాల ‘మల్లెపందిరి’లో హీరో) విజయనిర్మల అసలు పేరు నిర్మల. విజయవారి ‘షావుకారు’ తమిళ చిత్రంలో నటించినప్పుడు – విజయ కలుపుకొని విజయనిర్మల అయింది.

 

Leave a comment

error: Content is protected !!