Shopping Cart 0 items - $0.00 0

విక్రమ్ ‘కోబ్రా’లో ఇండియన్ మాజీ క్రికెటర్

 

చియాన్ విక్రమ్ సరైన విజయం సాధించి చాలా ఏళ్ళే అయిపోతోంది. అపరిచితుడు తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయాడు. ప్రయోగం పేరుతో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషించినా సరే.. అవేమీ అతడి కెరీర్ కు హెల్ప్ కాలేకపోయాయి. ఇప్పుడు కూడా విక్రమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. లేటెస్ట్ గా విక్రమ్ ‘కోబ్రా’ అనే చిత్రంలో వైవిధ్యమైన పలు పాత్రలు పోషిస్తున్నాడు. అజయ్ జ్నాన ముత్తు ఈ చిత్రానికి దర్శకుడు.  విక్రమ్ 7 పాత్రలకు సంబంధించిన ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్ననే విడుదల చేశారు మేకర్స్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మే నెల్లో విడుదల కానున్న ఈ సినిమా కు ఆస్కార్ పురస్కార గ్రహీత ఏ.ఆర్.రహ్మాన్ సంగీతం అందించడం విశేషం.

ఇక ‘కోబ్రా’ చిత్రానికి సంబంధించి..  మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఇండియన్ మాజీ క్రికెటర్ .. ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఈ పాత్ర కథను ఒక మలుపు తిప్పుతుందట. ప్రస్తుతం కోల్ కత్తాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా తర్వాత షెడ్యూల్  ను రష్యా, యూరోప్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందులో కేజీఎఫ్ గాళ్ శ్రీనిథి షెట్టి కథానాయికగా నటిస్తోంది. మరి కోబ్రా చియాన్ విక్రమ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!