చిత్రం : ‘వరల్డ్ ఫేమస్ లవర్’

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్,కేథరిన్ ట్రెస్సా, ఇజ్బెల్లా , జయప్రకాశ్, ప్రియదర్శి, రవివర్మ తదితరులు

సంగీతం: గోపీసుందర్

బ్యానర్ : క్రియేటివ్ కమర్షియల్స్

నిర్మాత : కే. వల్లభ

కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : క్రాంతిమాధవ్

టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్ లోవరుసగా ప్రేమకథలనే చేసుకుంటూ వస్తున్నాడు. యాజ్ యూజువల్ గా ఈ సారి కూడా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి  ఈ సినిమా తో అతడు ఏ రకంగా  ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు? లవర్ గా తన  పెర్ఫార్మెన్స్ తో వరల్డ్ ఫేమస్ అవుతాడో లేదో  చూద్దాం.

కథ :

గౌతమ్ ( విజయ్ దేవరకొండ ) కు రైటర్ అవడం డ్రీమ్. దాని కోసం చేస్తోన్న జాబ్ కు రిజైన్ చేస్తాడు.  లివిన్ రిలేషన్ షిప్ మెయిన్ టెయిన్ చేస్తోన్న తన లవర్ యామిని  (రాశీఖన్నా) ఒక సంవత్సరం సపోర్ట్ చేయమని కోరతాడు. దానికి సంతోషంగా అంగీకరించిన ఆమె అతడి కోసం ఒక బాజ్ లో జాయిన్ అవుతుంది . అయితే తను  రైటర్ అయ్యే క్రమంలో యామినిని పూర్తిగా పట్టించుకోవడం మానేసి తన లోకంలో తానుంటాడు గౌతమ్. దాంతో అతడి యాటిట్యూడ్ కు , బిహేవియర్ కు హర్ట్ అయిన ఆమె గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో ఆమె కోసం కథలు రాయడం మొదలు పెడతాడు అతడు. ఆ క్రమంలో వచ్చే ఉపకథల్లో యామినిని ఎలా ఊహించుకున్నాడు? చివరికి ఆమె ప్రేమను ఎలా  పొందుతాడు?  అన్నదే  ‘వరల్డ్ ఫేమస్ లవర్’ .

కథనం విశ్లేషణ :

ఇప్పుడొచ్చే ప్రేమకథా చిత్రాలన్నీ  దాదాపు  లవ్ అండ్ బ్రేకప్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం దానికి అతీతమేమీ కాదు. కాకపోతే రొటీన్ గా కాకుండా కాస్తంత భిన్నమైన రీతిలో ట్రీట్ మెంట్ రాసుకున్నాడు దర్శకుడు క్రాంతి మాధవ్. అసలు లవ్ స్టోరీని స్కెలిటన్ గా వాడుకొని .. అందులో కొన్ని ఎమోనల్ సబ్ ప్లాట్స్ ను ఇంప్లాంట్ చేశాడు. దాంతో సినిమాకి ఓ కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది. ముఖ్యంగా ఇల్లందు నేపథ్యంలో  సింగరేణి కార్మికుడు శీనయ్య , అతడి భార్య మీద రన్ చేసిన కథ అందరినీ బాగా ఎమోషనల్ గా  కదలిస్తుంది. అలాగే పారిస్ లో వచ్చే లవ్ స్టోరీని కూడా దర్శకుడు హృద్యంగా మలిచాడు.

గౌతమ్  సంవత్సరం పాటు పేపర్ మీద పెన్నే పెట్టకుండా టైమ్ వేస్తున్నాడని బాగా హర్ట్ అయిన  యామిని  .. అతడు   తన పట్ల చూపిస్తున్న  నిర్లక్ష ధోరణికి  బాధపడుతూ.. ప్రేమలో దైవత్వాన్ని చూడాలని,  ప్రేమ త్యాగాన్నికోరుతుందని అవేమీ నీలో లేవని చెడా మడా తిట్టేసి వెళ్లిపోతుంది. దాంతో .. తనలో ప్రేమ, త్యాగం రెండూ ఉన్నాయని నిరూపించుకొనే క్రమంలో  .. గౌతమ్  ఊహల్లోంచి రెండు ప్రేమ కథలు పుట్టుకొస్తాయి. దానికి రచయిత అతడే కాబట్టి.. ఆ ప్రేమకథల్లో తనకు యామిని పై ఉన్న ప్రేమను ప్రతిబింపచేస్తాడు. అప్పుడొచ్చేవే  ఇల్లందు, పారిస్ కథలు.

విజయ్ దేవరకొండ పోషించిన మూడు కథల్లోని పాత్రల్లోనూ .. ‘అర్జున్ రెడ్డి’ తరహా యాటిట్యూడ్ ను , అగ్రెసివ్ నెస్ ను యాడ్ చేయడంతో ఇందులో అతడు కొత్త చేసిందేమీ లేదనిపిస్తుంది. కానీ…అతడి స్క్కీన్ ప్రెజెన్స్ , పెర్ఫార్మెన్స్  ఆ లోపాన్ని కవర్ చేసేస్తాయి.  ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ .. అతడు రాస్తున్న బుక్ కు పేరు గా పెట్టడంతో  ఈ సినిమాకు  టైటిల్ జెస్టిఫికేషన్ బాగా ఇచ్చాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ ఉండడంతో దాని ఎఫెక్ట్ సినిమా మొత్తం మీద పడిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం మీద  ఈ సినిమాలోని ఫిక్షనల్ లవ్ స్టోరీస్ కు జనం బాగా కనెక్ట్ అయితే..  ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం హిట్టు గట్టెక్కినట్టే. మరి ప్రేక్షకులు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దాని పైనే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

గౌతమ్ గా విజయ్ దేవరకొండ అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఇల్లందు బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలో అయితే.. తెలంగాణా యాస్ లో అతడు పేల్చే డైలాగ్స్ ఎంతో ముచ్చటగా ఉంటాయి.  ఒక యూనియన్ లీడర్ గా ఎంత ఎఫెక్టివ్ గా నటించాడో, ప్యారిస్ లో ప్రేమకథలోనూ దానికి తగ్గట్లే సరిపోయాడు . అలాగే అతడి భార్యగా నటించిన ఐశ్వర్యా రాజేష్ .. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె నటన ఎమోషనల్ గా అందరినీ కదిలిస్తుంది. ఇక  రాశి ఖన్నాపాత్ర ఎంతో ప్రదానమైనది . అందులో ఆమె అద్భుతంగా ఒదిగిపోయింది. ఎక్కువగా ఎమోషనల్ యాంగిల్ ఉన్నా ఆమె నటనతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇక  క్యాథెరిన్ నటన బాగున్నా ఆమెకు దక్కింది చాలా చిన్న పాత్రే. ఇజబెల్ పర్వాలేదు, బాగానే చేసింది. మిగిలిన వాళ్ళు మామూలే.

సాంకేతిక నిపుణులు :

గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  .. సినిమాలోని ఎమోషనల్ మూడ్ కు తగ్గట్టుగా బాగా కుదిరింది. అలాగే పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. అలాగే డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల బాగా పేలాయి. ఇక సినిమా టో గ్రఫీ.. కొన్ని సీన్స్ లో  మెప్పిస్తుంది. ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు ఎంత కావాలో అంతా ఖర్చు పెట్టిన భావన కలుగుతుంది. టోటల్ గా ఈ లవర్ వరల్డ్ వైడ్ గా కాకపోయినా  లోకల్ గానైనా ఫేమస్ అవుతాడని చెప్పుకోవచ్చు.

రేటింగ్ : 3

బోటమ్ లైన్ : లవరే కానీ.. వరల్డ్ ఫేమస్ కాదు.

review by : రామకృష్ణ క్రొవ్విడి

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!