Shopping Cart 0 items - $0.00 0

పవర్ స్టార్ వారసుడ్ని హీరోగా పరిచయం చేస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రెండేళ్ళు గ్యాపిచ్చి..  త్వరలోనే తన కంబ్యాక్ మూవీతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఏకంగా  ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ప్రస్తుతం వాటిని ఒకొక్కటిగా ట్రాక్ ఎక్కించే  పనిలో ఉన్నాడు ఆయన. ఇక పవన్ రీసెంట్ గా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దాదాపు రూ. 5కోట్లు ఖరీదు చేసే విలసవంతమైన ఫ్లాట్ ను  తన వారసులైన  అకిరా నందన్, ఆద్యల కోసం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల  పవర్ స్టార్ తన వారసుడు అకిరా నందన్ కు నటనలో మంచి శిక్షణనిచ్చి.. టాలీవుడ్ లో హీరోగా పరిచయం చేయబోతున్నట్టు రివీల్ చేశాడు. ఇప్పుడా అనౌన్స్ మెంట్ కు తగ్గట్టుగా  అకీరా టాలీవుడ్ డెబ్యూ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

అతి త్వరలో అకిరా నందన్ ను టాలీవుడ్ లో హీరోగా పరిచయం చేస్తూ తన బ్యానర్ లో రామ్ చరణ్ ఒక సినిమా నిర్మించబోతున్నాడట. అకిరా నందన్ ను టాలీవుడ్ లోకి పరిచయం చేయాలని పవన్ అభిమానులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ డెసిషన్ వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తోందట. మరి అకిరా నందన్ టాలీవుడ్ డెబ్యూ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!