ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పరాజయాల పరంపరకు చెక్ పెట్టి.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు యంగ్ హీరో రామ్ పోతినేని. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్టు మూవీ ‘తడం’ రీమేక్ ‘రెడ్’ లో నటిస్తున్నాడు. మొదటిసారిగా రామ్ డ్యూయల్ రోల్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక మేటర్ లోకొస్తే.. రీసెంట్ గా మనోడు ట్విట్టర్ లో ఓ రాయల్ లుక్ పోస్ట్ చేసి.. జనాన్ని ఆశ్చర్యపరిచాడు.
ప్రముఖ తమిళనాడు ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్, సోనీ ఆల్ఫా కెమేరాస్ బ్రాండ్ అంబాసిడర్ అయిన కార్తిక్ శ్రీనివాసన్ .. చాలా రిచ్ గా క్లిక్ చేసిన ‘ది రాయల్ 2020 కేలండర్’ లో రామ్ పోతినేని కి కూడా స్థానం కల్పించాడు. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులు చాలా రాయల్ గా పోజులు పెడుతూ.. ఈ కేలండర్ కే నిండుతనం , రిచ్ నెస్ తెచ్చిపెట్టారు. యువరాజు గెటప్ లో ఒక పెద్ద కత్తిని పట్టుకొని రామ్ పెట్టిన రాయల్ పోజులు .. నెటిజెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదే కేలండర్ లో శింబు, భరత్ ,అరుణ్ విజయ్ , జీవా , అధర్వ్ , షాహిద్ కపూర్ ,శ్రుతిహాసన్, రెజీనా , మేఘా ఆకాశ్ , ప్రియా ఆనంద్ లాంటి నటీనటులు తమ పోజులతో మెప్పించారు. ఈ సందర్భంగా రామ్ కార్తిక్ శ్రీనివాసన్ కు థాంక్స్ చెబుతూ.. తన గెటప్ ను రివీల్ చేస్తూ మరీ ట్వీట్ చేశాడు.