దగ్గుబాటి రానా  తను త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ.. సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తన గర్ల్ఫ్రెండ్ గురించి చెప్తూ.. తన పేరు మిహీకా బజాజ్ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేశాడు రానా. అంతేగాక మిహీకాతో దిగిన సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేస్తూ.. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది’ అనే క్యాప్షన్ను జోడించాడు. అయితే పెళ్లి డేట్ ఎంగేజ్మెంట్ లాంటి విషయాలను మాత్రం సీక్రెట్ గా దాచాడు. కేవలం తనకు లైఫ్ పార్ట్నర్ ఎస్ చెప్పిందని మాత్రమే తెలిపాడు.

ఇక రానా పోస్ట్ పై మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. చిరు ట్వీట్ చేస్తూ.. “కంగ్రాట్స్ మై బాయ్.. అరివీర భల్లాలదేవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్నమాట. ఈ లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసింది నీకు వెడ్డింగ్ లక్ తీసుకొచ్చింది. గాడ్ బ్లెస్ యు. శతమానం భవతి” అంటూ ట్వీట్ చేశారు. చిరు స్పందనతో సెలబ్రిటీలంతా రానాను విష్ చేస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ – రానాలు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే చోట కలిసి చదువుకున్నారు కూడా.. ఇక చిరంజీవి కూడా రానాను తన కొడుకులాగే ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం రానా ఇంటివాడు అవుతుండటంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో ఆనందం మొదలయ్యిందని తెలుస్తుంది. మెగాస్టార్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ రానాకి విషెస్ తెలుపుతున్నారు.

Leave a comment

error: Content is protected !!