నేచురల్ స్టార్ నానీ పెర్ఫార్మెన్స్ గురించి, అతడి సినిమాల లైనప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అతడి అంబుల పొదిలో చాలా వైవిధ్యమైన అస్త్రాలే ఉన్నాయి. ఎర్లియర్ గా నానీ నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా.. ఆ ఆలోచనే తన మైండ్ లోకి రాకుండా.. ప్రస్తుతం వరుస చిత్రాలను పట్టాల మీదకు తెచ్చే వ్యూహరచనలో ఉన్నాడు. ఇటీవల శివ నిర్వాణ ‘టక్ జగధీష్’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళిన నానీ.. ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ‘వీ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మరో వైపు ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తో ఒక మూవీని లైన్ లో పెట్టుకున్నాడు. ఇకఅసలు విషయానికొస్తే ..మన నేచురల్ స్టార్ దిల్ ఉన్న ప్రొడ్యూసర్ రాజుగారి తో నాలుగో సారి వర్క్ చేయబోతున్నాడని సమాచారం.
గతంలో నానీ , దిల్ రాజు కొలాబరేషన్ లో ‘నేనులోకల్ , యం.సీ.ఏ’ చిత్రాలను చేసిన నానీ.. ఇంద్రగంటి ‘వీ’ లో సైతం నటిస్తున్నాడు. ఇప్పుడు నాలుగో సారి వీరి కలయికలో ఒక సినిమా చర్చల దశలో ఉందని సమాచారం. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. నక్కిన నెరేట్ చేసిన కథకు బాగా ఇంప్రెస్ అయిన నానీ.. సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. నేనులోకల్ తో నానీకి మంచి సక్సెస్ అందించిన నక్కిన ఇప్పుడు రెండో చిత్రానికి రెడీ అవుతూండడం ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.