Shopping Cart 0 items - $0.00 0

రకుల్ ‘ట్రీట్’ సింగ్

ఈ మధ్య ఇన్ స్టా గ్రామ్ అనేది ఒక హాట్ గ్రామం గా మారిపోయింది. ‘ఇక్కడ మస్తుగా అందాలు ఆరబోయబడును’ అనే బోర్డ్ పెట్టుకున్నట్టు సెలబ్రీటీస్ అందరూ అక్కడే తిష్ట వేసేసి.. నెటిజెన్స్ హృదయాల మీద దాడి చేస్తున్నారు. నిరంతరం తమ  హాట్ ఫోటో షూట్స్ తో దాన్నొక సోయగాల స్వర్గంగా మార్చేశారు. ఆ లిస్ట్ లోకి ఫ్లాప్ సినిమాలతో తడబడుతోన్న టాప్ హీరోయిస్స్ కూడా చేరిపోతున్నారు. అలాంటి వారిలో  ఈ మధ్య తరచుగా కనిపిస్తోన్న ముద్దు గుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ . ఆమె రీసెంట్ గా ఇచ్చిన అందాల బికినీ ట్రీట్ నెటిజెన్స్ కు షాకిచ్చింది.

గత కొంత కాలంగా అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో నడుస్తోంది. లాస్ట్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అమ్మడి కెరీర్ లోకి  రాహువు ప్రవేశించాడేమో అన్నట్టు గా ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్ , మన్మథుడు 2 మూవీస్ రెండూ ఘోర పరాజయం పాలయ్యాయి. అప్పటినుంచీ ఆమెకు సరైన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఆ క్రమంలో మిగతా భాషల్లో అవకాశాల గేలం వేస్తోంది. అందులో భాగంగానే అమ్మాయిగారు.. రెగ్యులర్ గా ఇన్ స్టా లో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తోంది. మొన్నీ మధ్యే ఒక బీచ్ నుంచి బికినీ ఫోటోస్ తో విరుచుకుపడిన అమ్మడు.. లేటెస్ట్ గా మరోసారి స్విమ్ సూట్ లో దర్శనమిచ్చింది.  ఒక  ఈతకొలనులో తడిసిముద్దవుతూ నవ్వుతూ పోజిచ్చింది. ఆ ఫోటోకి ఏకంగా ఏడు లక్షల లైక్స్ వచ్చిపడ్డాయి. అలాగే..  ఓ రేంజ్ లో రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి అవకాశాలు గట్టిగా రావాలంటే.. ఈ మాత్రం డోస్ ఉండాలి కదా.. మీరేమంటారు?

Leave a comment

error: Content is protected !!