నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106వ చిత్రాన్ని చేస్తోన్నసంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. అప్పుడే బాలయ్య 107వ చిత్రం గురించి కూడా ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకోసం ఓ వెటరన్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నాడట.

‘లారీడ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు’ లాంటి చిత్రాలతో బాలయ్యకు పలు సూపర్ హిట్స్ అందించిన  బి.గోపాల్ దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఎర్లియర్ మూవీ ‘రూలర్’ ను వెటరన్ డైరెక్టరైన కే.యస్.రవికుమార్ తో చేసి విమర్శలు మూటగట్టుకున్న బాలకృష్ణ మరోసారి వెటరన్ డైరెక్టర్ గోపాల్ లో చేయనుండడం టాలీవుడ్ లో చర్చలకు దారితీసింది. అంతేకాదు ఈ సినిమా బాలయ్య పుట్టినరోజునాడు అంటే.. జూన్ 10న లాంఛ్ కానుందని సమాచారం. మరి ఈ సినిమాతో బాలయ్యకు బీ. గోపాల్ ఏ రేంజ్ హిట్టిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!