ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ తో కలిసి తారక్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 8న సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. ఇక ఈ సినిమా తర్వాత యన్టీఆర్ నటించనున్న ప్రతిష్ఠాత్మక 30వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని నిన్న మొన్నటి వరకూ  అనధికారికంగానే వార్తలు వినిపించాయి. అయినా సరే తారక్ 30వ చిత్రం త్రివిక్రమే తెరకెక్కిస్తాడా లేక వేరు దర్శకుడికి ఆ ఛాన్స్ ఇస్తాడా అని డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ.. యన్టీఆర్ 30 చిత్రం ప్రకటన అధికారికంగా వచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండబోతోంది. ఎలాంటి సందేహాలు లేవు. కాకపోతే… హారిక అండ్ హాసిని బ్యానర్ తో సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ తన ఓన్ బ్యానర్ యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు.

నిజానికి యన్టీఆర్ 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని వారు సింగిల్ గానే నిర్మించాలనుకున్నారు. కానీ మధ్యలో కళ్యాణ్ రామ్ ఎంటరై ఈ సినిమా ను నిర్మిస్తానని  ఊగిసలాడాడు. అన్న యన్టీఆర్ ను ఈ విషయమై రాయబారం కూడా పంపాడు. ఒకదశలో ఈ సినిమా కళ్యాణ్ రామ్ బ్యానర్ లో పడదేమో అనుకున్నారు. త్రివిక్రమ్ అన్నదమ్ముల మధ్యలో చిచ్చుపెట్టాడని రూమర్స్ కూడా బైలు దేరాయి. అయితే మొత్తానికి.. ఈ ప్రకటనతో  ఆ ఇద్దరి సంయుక్త నిర్మాణంలోనూ ఈ సినిమా ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదలవుతుందని పోస్టర్ లో హింట్ కూడా ఇచ్చేశారు. ఇక యన్టీఆర్ ఇలా.. *ఆర్.ఆర్.ఆర్’  చిత్రాన్ని పూర్తిచేయడం ఈ సినిమాకు షిఫ్ట్ అవడం ఒకటే మిగిలి ఉంది. మరి దానికి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!