అన్నగారు యన్టీఆర్  మేకప్చ, విగ్గూ  లేకుండా సినిమా చేయడం  తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా చూశారా? ఆ రెండే ఆయన్ను తెలుగు వారికి ఆరాధ్యుల్ని చేశాయి. అలాంటి హీరోని ఎలాంటి జంకూ లేకుండా మేకప్ , విగ్గూ తీసేయమని ఆర్డర్ వేశాడు ఓ కెమేరా మేన్. ఆయన పేరు ఇషాన్ ఆర్య. ‘గరమ్ హవా’ లాంటి బాలీవుడ్ చిత్రంతో పాటు మరెన్నో భారతీయ చిత్రాలకు కెమేరా మేన్ గా పనిచేసినవాడు ఇషాన్ ఆర్య. దర్శకుడు బాపుకి ఆయన అభిమాన కెమేరా మేన్. ముత్యాల ముగ్గు, గోరంత దీపం లాంటి సినిమాలకు ఇషానే కెమేరా మేన్. అందుకే అలాంటి ఆయన్ను యన్టీఆర్ సినిమాకి నియమించు కున్నాడు ఒక ప్రొడ్యూసర్. తొలిరోజు షూటింగ్ కు యన్టీఆర్ మేకప్ , విగ్గుతో సహా సెట్స్ లోకి అడుగుపెట్టారట. దాంతో అది చూసిన ఇషాన్.. యన్టీఆర్ ను విగ్గు తీసేసి, మేకప్, లిప్ స్టిక్ పూర్తిగా తుడిచేయమని చెప్పాడట. దాంతో నిర్మాతలు దానికి అభ్యంతరం తెలిపుతూ.. యన్టీఆర్ అలాగే నటిస్తారు కుదరదు అన్నాడట. దాంతో ఇషాన్ వేరే కెమేరా మేన్ ను పెట్టుకోండని సెట్స్ నుంచి వెళ్ళిపోయాడట. దానికి అందరూ షాక్ తిన్నారు. ఇషాన్ ఆర్య నటీనటులు తన కెమేరా ముందు సహజంగా కనిపించాలని   కోరుకోవడమే దానికి కారణం . అందుకే ఆయన మేకప్ , విగ్గు, లిప్ స్టిక్ లాంటి  అసహజమైన వాటిని పక్కన పెట్టమనేది. అదండీ సంగతి. 

Leave a comment

error: Content is protected !!