కొందరు నటులు సినిమాల్లో నటించడానికి పుడతారు. మరికొందరు సినిమాల్ని ప్రభావితం చేయడానికి పుడతారు. ఇంకొందరు.. సినీ చరిత్రలో తమ పేరును చిరస్థాయిగా లిఖించుకోడానికి పుడతారు. యన్టీఆర్ మూడో కోవకు చెందిన నటుడు. అసలు ఆయన సినిమాల్లో ప్రవేశమే దైవ సంకల్పంగా భావిస్తారు కొందరు. అలా యల్.వి.ప్రసాద్ కు యన్టీఆర్ చూడగానే నచ్చేశారట.

గృహప్రవేశం’ 1946లో విడుదలైంది. కళాదర్శకుడు కళాధర్‌కి ఇది తొలి సినిమా. ఈ సినిమా తరువాత, కొత్తనటుల కోసం అన్వేషించాలనీ ప్రతిభగలవారు దొరకుతారనీ ప్రసాద్‌ – ప్రకటన వేసి, 5 కేంద్రాలు తిరిగారు. ఆయనతోపాటు కళాధర్‌ కూడా వెళ్లారు. విజయ సంస్థ ఆరంభం కానున్న తరుణంలో నెలజీతాల మీద నటీనటుల్ని తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. అప్పుడే ఎన్‌.టి.రామారావు కనిపించారట. బెజవాడలో, ఒక డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసుకి రమ్మని ఇచ్చిన ప్రకటన చూసి కొందరు నటులు వచ్చారు. వాళ్లలో ఒకరు ఎన్‌.టి.రామరావు. ప్రసాద్‌ రామారావుని చూసి ముచ్చటపడి, వివరాలు అడిగారట. రంగస్థలానుభవం ఉందని చెప్పగా, రూపురేఖలు బాగున్నాయని చెప్పి, తరువాత మద్రాసు రప్పించారు ప్రసాద్‌. అనుభవం వస్తుందని ‘మనదేశం’ లో, ఇన్స్‌పెక్టర్‌ పాత్ర వేయించారు. అలా, లభించారు రామరావు తెలుగు సినిమాకి.

 

 

Leave a comment

error: Content is protected !!