హ్యాండ్సమ్ లుక్.. స్మైలీ ఫేస్ .. స్టైలిష్ పెర్ఫార్మెన్స్ .. కలగలిస్తే నితిన్. తెలుగు తెరపై యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ తో చెలరేగే అతగాడు.. సినిమాల్లోకి రావాలనుకోవడానికి కారణం తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడమే. రోజుకో సినిమా చూడనిదే నిద్రపోని నితిన్ ను బాగా కదిలించిన చిత్రం పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రమే అంటాడు. దాన్ని  థియేటర్ లో 28సార్లు చూశాడట. నువ్వు నేను సినిమాకి వెళ్ళిన నితిన్ ను చూసి దర్శకుడు తేజ .. నేను తీయబోయే జయం సినిమాలో హీరోగా నటిస్తావా అని అడిగాడట. అదృష్టం మన ఇంటి తలుపు తడుతుంటే.. తీయకపోవడం మన దురదృష్టమే అవుతుంది కాబట్టి.. నితిన్ అందులో హీరోగా నటించి..  తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వివివినాయక్ దిల్ తో సూపర్ హిట్టు కొట్టి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సై లో నటించి ..హీరోగా మరింతగా ఎదిగాడు. అయితే 2005 నుంచి వరుసగా పరాజయాలు పలకరించినా.. తట్టుకొని నిలబడి పడిలేచిన కెరటం అనిపించుకున్నాడు.

ఇష్క్, గుండెజారి గల్లంతైందే, అఆ, ఇప్పుడు భీష్మ చిత్రాలతో నితిన్ హీరోగా మళ్లీ తన స్థానానికి తాను వచ్చి చేరాడు.  ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటిస్తోన్న నితిన్ .. ఆ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.  నేడు నితిన్ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఈ నట భీష్మకి శుభాకాంక్షలు తెలుతోంది మూవీ వాల్యూమ్…

హ్యాపీ బర్త్ డే నితిన్

 

 

Leave a comment

error: Content is protected !!