సహజత్వంతో కూడిన  సామాజిక ఇతివృత్తాల్ని  వెండితెరమీదకు తీసుకురావడంలో తమిళ దర్శకులు దిట్ట. అందులో వెట్రీ మారన్ చాలా ప్రత్యేకం. ధనుష్ తో ‘ఆడుకళాం, వడ చన్నై, అసురన్’ లాంటి సినిమాల్ని ఆ తరహాకథలతోనే తెరకెక్కించి కమర్షియల్ హిట్స్  గా మలిచాడు. అలాంటి దర్శకుడు మన యంగ్ టైగర్ మీద కన్నేశాడట. ఎప్పటినుంచో తెలుగులో ఒక డైరెక్ట్ సినిమా చేయాలనుకుంటోన్న అతగాడు.. అది  యన్టీఆర్ తోనే అని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు తారక్ తో ఈ విషయం గురించి డిస్కస్ చేసి స్టోరీ లైన్ కూడా చెప్పాడట. ఒక వేళ తారక్ కు మాత్రం ఆకథ నచ్చితే..  వెట్రిమారన్ , యన్టీఆర్ తదుపరి చిత్రం ఇదే అంటున్నారు.

ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్న తారక్..  ఆ సినిమా కంప్లీట్ కాగానే..  ఏ స్ర్కిప్ట్  రెడీ గా ఉంటే దానితోనే  సినిమా చేయాలనుకుంటున్నాడట. ఆల్రెడీ తారక్ తో నెక్ట్స్ మూవీకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో కర్చీఫ్ వేశాడు, ప్రస్తుతం యన్టీఆర్ కోసం ఒక పొలిటికల్ యాక్షన్ స్టోరీని ప్రిపేర్ చేస్తున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళుతుంది.  ఈ లోపు వెట్రి మారన్ కథ రెడీ చేస్తే అతడి డెబ్యూ తెలుగు మూవీఇదే కానుంది. మరి ఆ దర్శకుడు  త్రివిక్రమ్ కన్నా ముందే స్టోరీ రెడీ చేస్తాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!