డిస్కవరీ ఛానల్ లో ప్రసారమవుతోన్న క్రేజీ షో   మ్యాన్ vs వైల్డ్ . బ్రిటన్ కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్ .. ఈ షోలో ఒంటరిగా అడవుల్లో చేసే సాహసాలు ఒళ్ళు గగుర్పొడుస్తూంటాయి. అలాంటి ఈ షో లో గతేడాది ప్రధాని నరేంద్రమోడి పొల్గొన్న సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో గ్రిల్స్ నరేంద్రమోడితో కలసి కలియతిరిగాడు.

ఇప్పుడు ఈ షోలోకి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రానున్నాడు. కర్నాటకలోని బందీపూర్ అటవీ ప్రాంతంలో రజనీతో కలసి బేర్ గ్రిల్స్ మేన్ వర్సెస్ వైల్డ్ షో ను చిత్రీకరించనున్నాడు. వీరిద్దరూ కలసి టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో తిరగనున్నారు. సుమారు 6 గంటలపాటు వీరిద్దరూ అడవిలో గడపనున్నారట. నేటి నుంచి ఈ నెల 30 లోపు ఈ షో చిత్రీకరణ జరపుకోనుందని సమాచారం. అయితే ఈ షో డిస్కవరీ లో ఎప్పుడు ప్రసారం కానుందో ఇంకా తెలియదు.

Leave a comment

error: Content is protected !!