Shopping Cart 0 items - $0.00 0

మోషన్ పోస్టర్ : రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఈ సినిమా. ఇక ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ అబ్రివేషన్ ను రివీల్ చేస్తూ.. రాజమౌళి అండ్ కో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోతో కూడిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాదాపు 5 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో 5 భాషల్లోనూ టైటిల్ లోగోల్ని , మోషన్ పోస్టర్స్  ను విడుదల చేశారు. ఇక దీనికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖాయం చేశారు.

అన్నిభాషల్లోనూ రౌద్రం రణం రుధిరం టైటిల్ ను ఫిక్స్  చేయగా.. ఒక్క హిందీలో మాత్రం ‘రైజ్ రివోల్ట్ రోర్’ గా టైటిల్ ఖాయం చేశారు.  ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జక్కన్న అభిమానులకు ఇచ్చిన  ఉగాది కానుక అద్భుతమని తెగ సంబరపడిపోతున్నారు. 

https://www.youtube.com/watch?v=OwUWdrlBiJU&list=PLgCNTKEOcOc4aYVkI6_U-ad_TJbmugsWA&index=2

Leave a comment

error: Content is protected !!