అల్లరి నరేశ్ వెరైటీ పాత్రలో .. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ మూవీ ‘నాంది’. యస్వీ2 బ్యానర్ పై ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న తొలి సారిగా నిర్మాతగా మారుతూ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇటీవల కాలంలోనే లాంఛ్ అయింది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళిన ‘నాంది’ చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ను విజయ వంతంగా పూర్తి చేసుకుంది.

అల్లరి నరేశ్ 57 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘నాంది’ కథాంశం .. అతడి గత చిత్రాలన్నిటికన్నా చాలా విభిన్నమని తెలుస్తోంది. ఆల్రెడీ ‘గమ్యం, నేను , ప్రాణం , శంభో శివ శంభో’ లాంటి చిత్రాలతో తనలోని బెస్ట్ పెర్ఫార్మర్ ను వెలికితీసిన అల్లరోడు..  ‘నాంది’ చిత్రంలో అంతకు మించిన స్థాయిలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలవారు   చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా రొటీన్ చిత్రాలు చేస్తూ.. తన కెరీర్ ను డౌన్ ఫాల్ చేసుకున్న అల్లరి నరేశ్ .. నాంది మూవీతో విజయాలకు నాంది పలుకుతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!