మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ మొగుడు కావాలి. 1980లో విడుదలైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఈ సినిమాతో గాయత్రి అనే కొత్త హీరోయిన్ పరిచయం అయింది. చిరుతో ఆమె రొమాన్స్ సినిమాకి హైలైట్. చరిత్ర చిత్ర బ్యానర్ పై తమ్మారెడ్డి వికె నిర్మాణంలో కట్టాసుబ్బారావు దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఇంకా నూతన్ ప్రసాద్, సువర్ణ, రమణమూర్తి, యస్. వరలక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జేవీ రాఘవులు సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లకు ఈడొస్తే, ఆకాశంలో తారకలు పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్.
కృష్ణ (గాయత్రి) తన తండ్రి నుంచి చాలా ఆస్తి వారసత్వంగా పొందింది. కాని దాన్ని సొంతం చేసుకోవాలంటే ఆమె పెళ్ళి చేసుకోవాలని అతను ఒక షరతు విధిస్తాడు ఆమె తండ్రి . కానీ కృష్ణకి పెళ్ళి అంటే పడదు. తన స్నేహితురాలు శాంతి జీవితం పెళ్ళి వల్లనే నాశనం అయిందనన్నది ఆమె ఫీలింగ్. కానీ, ఆమెకు ఆస్తి అవసరం. కాబట్టి, ఆమె చిరు (చిరంజీవి) ని అద్దె భర్తగా ఆ ఇంటికి తెచ్చి ఆస్తికోసం ప్రయత్నిస్తుంది. అయితే చిరు ఆమెను ఎలా మారుస్తాడన్నదే మిగిలిన కథ . నిజానికి ఈ సినిమా ‘మంచలి’ హిందీ సినిమాకి రీమేక్ వెర్షన్. సంజీవ్ కుమార్ , లీనా చందవర్కర్ జంటగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అయిదే ఇదే కథాంశాన్ని కాస్తంత మార్చి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ గా తెరకెక్కించి సాయిధరమ్ తేజ కు మంచి హిట్టిచ్చాడు హరీశ్ శంకర్.