Shopping Cart 0 items - $0.00 0

‘మై లవ్…’ అంటూ ఫస్ట్ సింగిల్ పాడుతోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’

‘ఓనమాలు, మళ్ళీ మళ్ళీ  ఇదిరానిరోజు, ఉంగరాల బంగర్రాజు’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మిశ్రమ ఫలితాలందుకున్న క్రాంతి మాధవ్ .. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ‘వరల్డ్ ఫేమస్ లవర్‘ అనే ప్రేమకథాచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కథకథనాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపిస్తోన్న ఈ మూవీ వేలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది చిత్ర బృందం. ముందుగా ఇందులోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు.

మై లవ్ అంటూ.. సాగే ఈ శ్రావ్యమైన గీతం ఐ యామ్ సో క్రేజీ బేబీ లైఫ్ ఈజ్ సింగింగ్ లవ్ మెలోడీ అనే కోరస్ తో ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ, రమ్య బెహరా ఆలపించిన ఈ యూత్ ఫుల్ సాంగ్ ను రహమాన్ రచించారు. గోపీసుందర్ సంగీత సారధ్యంలో.. మై లవ్ మనసును మీటే ఏదో తియ్యని పాటే యదలో ఎపుడూ వినని యదలో ఎపుడూ జరిగే సింఫనీ.. ఐ ఫీల్ నౌ” అంటూ ఎంతో శ్రావ్యంగా సాగుతుంది ఈ పాట. ఈ లిరికల్ సాంగ్ వీడియో విజయ్ దేవరకొండ, రాశీఖన్నా రొమాంటిక్ స్టిల్స్ అండ్ సీన్స్ మీద సాగుతుంది. అంచనాలు పెంచుతోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ … వేలెంటైన్స్ డే  రోజున ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.  

లిరికల్ వీడియో కోసం కింద లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=137&v=jmeR4bwhOtA&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!