దగ్గుబాటి రానా హీరోగా తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హిందీ యాక్షన్ మూవీ ‘హాథీ మేరే సాథీ’ . ‘అరణ్య’గా తెలుగులోనూ, ‘కాడన్’ గా తమిళంలోనూ ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఏప్రిల్ 2న పాన్ ఇండియా కేటగిరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అడవుల్లోనే పుట్టిన పెరిగిన ఒక యువకుడు అడవి జంతువుల్ని కాపాడుకోవడానికి జనారణ్యంలోకి వచ్చి చేసే  యుద్ధమే ఈ చిత్రకథ. గ్రాఫిక్స్ లో కాకుండా ఒరిజినల్ ఏనుగులు  ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేశారు.

అడవుల్లో రానా పడిన కష్టం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఏకకాలంలో హిందీ, తమిళ్, తెలుగు డైలాగ్స్  ను పలుకుతూ.. ఒకే సీన్ ను అనేకసార్లు షూట్ చేస్తూ టీమ్ మొత్తం పడిన కష్టమూ ఇందులో కనిపిస్తుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కు వనమాలి డైలాగ్స్ , పాటలు రాశాడు.  తమిళ నటుడు విష్ణు విశాల్ కూడా మరో ప్రధాన పాత్రపోషిస్తోన్న ఈ సినిమా రానాకు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

మేకింగ్ వీడియో కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=KmkiIckKg1Q

Leave a comment

error: Content is protected !!