మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తారో తెలిసిందే. వీలైనప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంటూఉంటారు. కొంతకాలంగా చిరంజీవి తల్లి అంజనాదేవికి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. ఆవిడ ఏదో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నారని తెలిసింది. అయితే అదే సమయంలో నిన్నఆమె తన జన్మదినం కూడా జరుపుకున్నారు. పెద్ద కొడుకు చిరంజీవి ఇంట్లో తన కూతుళ్లతో కలసి ఆమె తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. నాగబాబు కూతురు నీహారిక కూడా వారితో కలిసి నానమ్మ పుట్టిన రోజు సంబరాల్లో పాల్గొంది.
ఈ సందర్భంగా చిరు తన తల్లితో ఒక సెల్ఫీ దిగారు. నిన్నటి నుంచి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరునవ్వు నవ్వుతోన్న మాతృమూర్తితో చిరంజీవి కూడా నవ్వులు చిందిస్తూ .. పోజిచ్చారు . అలాగే ఆమెతో కేక్ కట్ చేయించి.. చిరంజీవి చెల్లెళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అన్న , తల్లితో కలసి ఫోటో దిగారు.