Shopping Cart 0 items - $0.00 0

మెగాస్టార్ పై కన్నేశాడు

‘గద్దలకొండ గణేష్’ సక్సెస్  తో మళ్ళీ ఫామ్ లోకొచ్చాడు మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ . ఆ మూవీ వచ్చి నాలుగు నెలలైపోతున్నా.. ఇంతవరకూ హరీశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక కథ వినిపించాడట. కానీ అది పవన్ కి నచ్చక పక్కనపెట్టాడట. అయినా పవనిప్పుడు బోలెడంత బిజీ. ఆల్రెడీ రెండు సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. మూడో సినిమాను కూడా  త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు.  ఒక వేళ ఇప్పటికిప్పుడు పవన్ ను  హరీశ్ వేరే కథతో కన్విన్స్ చేసినా.. ఆ సినిమా మొదలడం ఇప్పటిలో జరిగే పని కాదు. అందుకే హరీశ్  శంకర్ కన్ను ఇప్పుడు మెగా స్టార్ మీద పడిందని తెలుస్తోంది.

రీసెంట్ గా హరీశ్ చిరును కలిసి ఒక లైన్ వినిపించాడట. అయితే మెగాస్టార్ పూర్తి స్ర్కిప్ట్ తో వచ్చి నెరేట్ చేస్తే అప్పుడు తన నిర్ణయం చెబుతానన్నాడట. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.  ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కు సినిమాను విడుదల చేయాలని చిరు ప్లాన్.  ఆ సినిమా విడుదలయ్యాకా గానీ  ఆయన తదుపరి చిత్రం పై ఒక నిర్ణయం రాదు . అప్పటి వరకూ హరీశ్ శంకర్ వెయిట్ చెయ్యక తప్పదు. మరి అంతవరకూ హరీశ్ ఆగుతాడో .. ఈ గ్యాప్ లో వేరే హీరోతో కమిట్ అవుతాడో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!