నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒకెత్తైతే.. ‘ముద్దుల మావయ్య’ ఒకటీ ఒక ఎత్తు. 1989లో విడుదలైన ఈ మూవీ హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి అప్పట్లో రికార్డులకెక్కింది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా నిజానికి ఒక తమిళ చిత్రం రీమేక్. పి.వాసు దర్వకత్వంలో ప్రభు హీరోగా వచ్చిన ‘ఎన్ తంగచ్చి పడిచ్చవ’ (నా చెల్లెలు విద్యావంతురాలు) తమిళ మూవీని కోడి రామకృష్ణ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. బాలకృష్ణ, విజయశాంతి, రాజా కృష్ణమూర్తి, ఆనందరాజ్ , ఈశ్వరరావు నటీనటుల కలయికతో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఇక ఇదే మూవీ అమితాబ్ హీరోగా ‘ఆజ్ కా అర్జున్’ పేరుతో బాలీవుడ్ లోనూ , ‘రవిమామ’ గా రవిచంద్రన్ తో కన్నడలోనూ.. ‘పబిత్ర పాపి’ గా ప్రసేన్ జిత్ హీరోగా బెంగాలీలోనూ రీమేక్ అయి ఆయా భాషల్లోనూ మంచి సక్సెస్ సాధించింది.