పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్ని ట్రాక్ ఎక్కిస్తూ తన అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ‘పింక్’ రీమేక్ మూవీ ని లైన్ లో పెట్టిన పవన్ .. ఈ రోజు క్రిష్ మూవీని మొదలు పెట్టాడు. ఇప్పుడు మూడో సినిమా కూడా పట్టాలెక్కించబోతున్నాడని టాలీవుడ్ టాక్. అయితే ఆయనతో సినిమా చేయబోయే దర్శకుడు మరెవరో కాదు.. పూరీ జగన్నాథ్ . ‘బద్రీ, కెమేరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబో లో ముచ్చటగా మూడో సారి రానున్న ఈ మూవీ అతి త్వరలోనే మొదలు కానుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
‘పింక్’ రీమేక్ మూవీ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అయితే.. క్రిష్ తో చేసేది పీరియాడికల్ జోనర్ లో నడుస్తుంది. ఇప్పుడు పూరీ తో చేయబోయే చిత్రం పక్కా యాక్షన్ అని తెలుస్తోంది. పవర్ స్టార్ నుంచి ఆయన అభిమానులు కోరుకొనేది ఇలాంటి సినిమాలే కనుక ..పూరీ, పవన్ తో చేయబోయే చిత్రానికి యాక్షన్ కథనే ఎన్నుకోనున్నాడట. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్ .. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తయిన తర్వాత పూరీ.. పవర్ స్టార్ తోనే చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి పవర్ స్టార్ , డైనమిక్ డైరెక్టర్ ఈ సారి ఏ స్థాయిలో ఔట్ పుట్ ఇస్తారో చూడాలి.