Shopping Cart 0 items - $0.00 0

ముగ్గురు లెజెండ్స్ తనయులతో నటించిన బిగ్ బీ

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ వయసులో కూడా వరుస సినిమాలతో  బిజీగా ఉంటాడు. దాంతో పాటు పెద్ద పెద్ద కంపెనీల యాడ్స్ లో కూడా తరచుగా నటిస్తూంటాడు.  ఇక  సోషల్ మీడియాలో అయితే   ఎప్పటికప్పుడు తన యాక్టివిటీస్ ను నెటిజెన్స్ తో షేర్ చేసుకుంటూ.. ప్రతీ విషయానికి స్పందిస్తుంటాడు. ఆ క్రమంలో ఆయన తన జీవితంలో జరిగిన ఒక అచీవ్ మెంట్ పట్ల తన స్పందన తెలియచేస్తూ   ట్విట్టర్ అకౌంట్లో రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు.

బిగ్ బీ నటించిన కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ గురించి తెలిసిందే. అందులో ఆయనతో పాటు తెలుగు వెర్షన్ లో నాగార్జున, తమిళ వెర్షన్ లో ప్రభు గణేశన్, కన్నడ  వెర్షన్ లో శివ రాజ్ కుమార్ నటించారు. ఈ విషయం మీదే స్పందిస్తూ..  తనకు, జయకు జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప అచీవ్ మెంట్ ఇది. తెలుగు లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున తోనూ,  తమిళ లెజెండ్ శివాజీ గణేశన్ తనయుడు ప్రభుతోనూ, కన్నడ లెజెండ్ రాజ్ కుమార్ తనయుడు శివ రాజ్ కుమార్ తో కలిసి నటించడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నాను అంటూ  సంతోషాన్నివ్యక్తం చేస్తూ ఆ ముగ్గురితో ఆయన, ఆయన సతీమణి కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. నిజంగా అది ఆయనకే కాదు.. ఆయనతో పాటు నటించిన ఆ ముగ్గురు తనయులకూ ఒక అచీవ్ మెంట్ లాంటిదే.

 

 

 

Leave a comment

error: Content is protected !!