ఆయనో విలక్షణ నటుడు.   వైవిధ్యమైన కథలతో మాత్రమే చిత్రాలు చేస్తాడు. పాత్రలో కొత్త దనం ఉంటేనే ఆ సినిమాకి కమిట్ అవుతాడు. ఒక్కసారి ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే..  తాను చేయబోయే పాత్ర కోసం వంద శాతం ఎఫెర్ట్స్ పెట్టి.. దానికి తనదైన శైలిలో జీవం పోస్తాడు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులు మిస్టర్ పెర్ఫెక్ట్ అని ముద్దుగా పిలుచుకొనే ఆమిర్ ఖాన్. చేసే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే కాకుండా.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోయేలా పెర్ఫార్మ్ చేస్తాడు. అందుకే ఆయన సినిమాలు రాశిలో తక్కువైనా .. వాసిలో మాత్రం చాలా ఎక్కువ.

‘లగాన్, గజినీ, 3 ఇడియట్స్, దిల్ చాహ్ తా హై, పీకే, దంగల్ , సీక్రెట్ సూపర్ స్టార్  లాంటి సినిమాల్లోని వైవిధ్యమైన  పాత్రలు ..ఆమిర్ ఖాన్ నటనకు ఉత్తమ నిర్వచనం గా నిలిచిపోయాయి.  ప్రస్తుతం ఆమిర్ లాల్ సింగ్ ఛద్దా అనే మూవీలో నటిస్తున్నాడు. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ దర్శకుడు అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆస్కార్ పురస్కారం అందుకున్న హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. కాగా ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ఆమిర్ ఖాన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. కథ తనకి అద్భుతంగా నచ్చితే నిర్మించడానికి వెనుకాడని ఆమిర్ ఖాన్ …. నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ మిస్టర్ పెర్ఫెక్ట్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే ఆమిర్ ఖాన్

 

Leave a comment

error: Content is protected !!