మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం‘క్రాక్’ మూవీ షూటింగ్ హడావిడిలో ఉన్నాడు. అందులో రూకీ కాప్ గా నటిస్తున్న మనోడు.. రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాలోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండూ సైమల్ టేనియస్ గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఓ మూవీ ,  నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మరో  మూవీకి రవితేజ కమిట్ అయినట్టు తెలుస్తోంది. అందులో నక్కిన చిత్రం   ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కనుందట.

మేలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాలో  తమన్నా భాటియా కథానాయిక గా నటించనుండడం విశేషంగా మారింది. ఇంతకు ముందు తమన్నా రవితేజ తో ‘బెంగాల్ టైగర్’ లో నటించింది. అందులో ఓ రేంజ్ లో గ్లామర్ ను  ఒలికించిన అమ్మడు ఈ మూవీలో కూడా అదే మోతాదులో అందాలు ఆరబోయనుందట. ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’, నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్రాలు నిర్మిస్తోన్న టిజీ విశ్వప్రసాద్ .. రవితేజ , నక్కిన కాంబో మూవీని నిర్మించనున్నట్టు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ రవితేజకు ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!