Shopping Cart 0 items - $0.00 0

మాతృదేవోభవ

తెలుగులో మదర్ సెంటిమెంట్ తో గతంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నిటికన్నా భిన్నంగా ఉండడమే కాకుండా.. కాస్తంత ఎక్కువ మోతాదులోనే ప్రేక్షకుల చేత కన్నీళ్ళు పెట్టించిన చిత్రం ‘మాతృదేవోభవ’. అలనాటి అందాల నాయిక మాధవి ప్రధాన పాత్రలో, నాజర్ మరో ముఖ్యభూమికను పోషించిన ఈ సినిమాను కె.అజయ్ కుమార్ తెరకెక్కించాడు. లుకేమియాతో బాధపడుతోన్న ఒక తల్లి .. కొద్ది రోజుల్లో తాను చనిపోతానని తెలుసుకొని.. తన బిడ్డల్ని ముందుగానే అనాథాశ్రమానికి పంపించడమే చిత్రకథ. 1993 లో విడులైన ఈ సినిమాను చూసి చలించని ప్రేక్షకుడే లేడంటే అతిశయోక్తి కాదు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అనే పాటకు వేటూరికి జాతీయ అవార్డు లభించడం మరో విశేషం. తెలుగు తెరమీద అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. నిజానికి సిబిమలయిల్ తెరకెక్కించిన ‘ఆకాశదూత్’ అనే మలయాళ చిత్రానికి రీమేక్. మాధవినే ప్రథాన పాత్ర పోషించిన ఈ సినిమా అక్కడ కూడా కన్నీళ్ళు పెట్టించింది. ఇదే సినిమా కన్నడలో ‘కరులిన కూగు’ గానూ, హిందీలో ‘తుల్సి’ గానూ , మరాఠీలో ‘చిమని పఖరే’ గానూ విడుదలై అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను ‘హూ విల్ లవ్ మై చిల్డ్రన్’ అనే హాలీవుడ్ మూవీని బేస్ గా తీసుకొని తెరకెక్కించాడు మలయాళ దర్శకుడు సిబిమలయిల్ .

Leave a comment

error: Content is protected !!