Shopping Cart 0 items - $0.00 0

మహేశ్ బాబు డ్యూయల్ రోల్ ?

 

సరిలేరు నీకెవ్వరు’ ఘనవిజయంతో మంచి హుషారు గా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం తదుపరి చిత్రంపై ఫోకస్ పెడుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్నఈ సినిమా పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో మహేశ్ బాబు తొలిసారిగా గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఇందులో మనోడు ద్విపాత్రాభియం చేస్తున్నాడట. కాగా అందులో ఒకటి గ్యాంగ్ స్టర్ అయితే మరొకటి లెక్చరర్ పాత్ర  అవడం విశేషం. ‘కొడుకుదిద్దినకాపురం’ చిత్రంలో బాలనటుడిగా ఉన్నప్పుడే  ద్విపాత్రాభినయం చేసిన మహేశ్ ..  యంగ్ హీరో అయ్యాకా డ్యూయల్ రోల్ పోషించడం ఇదే మొదటిసారి.

అయితే డ్యూయల్ రోల్ కాకుండా.. రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలు అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. రజనీకాంత్ బాషా తరహాలో  గ్యాంగ్ స్టర్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకానున్నట్టు సమాచారం. ‘మహర్షి’ సూపర్ సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లి మరోసారి మహేశ్ తోనే సినిమా చేయనుండడం విశేషంగా మారింది.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్  ను జరుపుకోనున్న ఈ సినిమాకి మహేశ్ డ్యూయల్ రోల్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!