దేశంలో మూడో విడత లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించడంతో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి రెండోసారి వాయిదా పడింది. దీంతో నిఖిల్ నిరుత్సాహంలో మునిగిపోయాడు. నిఖిల్ పెళ్లి మొదట ఏప్రిల్ 16న ఖారారు చేశారు. అయితే లాక్‌డౌన్ లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి తేదీని మార్చుకున్నారు. రెండు కుటుంబాలు చర్చించుకుని మే 14న పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ  లాక్‌డౌన్‌ను పొడిగించడంతో రెండోసారి కూడా నిఖిల్ పెళ్లి వాయిదా పడింది. ఈ విషయమై నిఖిల్ చాలా ఫస్ట్రేటింగ్‌గా ఉందని తెలిపాడు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేంత వరకు తన పెళ్లిని వాయిదా వేస్తున్నానని నిఖిల్ వెల్లడించాడు.

 తనకిది నిజంగా గడ్డుకాలం అని అన్నాడు. ప్రస్తుతం బయట చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారితో పోలిస్తే తనకు పెద్ద ఇబ్బందేమీ కాదని స్పష్టంచేశాడు. నా పెళ్లి వల్ల ఒక్కరికి కరోనా సోకినా, అది జీవితాంతం నన్ను వెంటాడుతుంది. పెళ్లి అనేది మన జీవితంలో ఎంతగానో గుర్తుండిపోయే రోజు కావాలి. కాబట్టి, పెళ్లి అనేది చాలా ఫర్‌ఫెక్టుగా ఉండాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేసుకోవాలని నేను అస్సలు అనుకోను. పల్లవి, నేను ఎన్ని రోజులైనా వేచి చూడగలం. కరోనాను పూర్తిగా నిర్మూలించిన తరవాతే మేం పెళ్లి చేసుకుంటాంఅని నిఖిల్  ఓ మీడియా ముందు తెలిపాడు.

Leave a comment

error: Content is protected !!