రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజై… చరణ్ నిప్పులాంటివాడని, యన్టీఆర్ నీటిలాంటి వాడని జక్కన చెప్పగానే ఈ సినిమాలోని వారి వారి పాత్రల్ని అభిమానులు తమ ఇమేజినేషన్ లో చూసుకున్నారు. అయితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా యన్టీఆర్ తన పుట్టిన రోజు గిఫ్ట్ ను పంపుతున్నానని చెప్పగానే..అందరూ ఆ గిఫ్ట్ గురించి ఆత్రుతగా ఎదరుచూశారు. కాసేపటి క్రితమే ఆ గిఫ్ట్ అందేసింది. చెర్రీ అల్లూరి సీతారామరాజు కు సంబంధించిన ఆ వీడియో అదిరిపోయింది. కండలు తిరిగిన శరీరంతో చెర్రీ గెటప్ అభిమానులకు ఫుల్ ఐ ఫీస్ట్ ఇచ్చాడు.  

యన్టీఆర్ వాయిస్ ఓవర్ మీద సాగిన ఆ వీడియో ను చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు.  ‘ఆడు  కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమటలు ధారకడతది. పాణమైనా బంధూకైనా ఆడికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి . సాకింది గోదారి. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు’. అంటూ అద్భుతమైన విజువల్స్ తో జక్కన్న అందరికి గూస్ బంప్స్ తెప్పించాడు. మరి చెర్రీ పాత్ర పూర్తిగా వెండితెరమీద చూస్తే ఇంకెలా ఉంటుందో.

వీడియో ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://bit.ly/2ULCnxM

Leave a comment

error: Content is protected !!