Shopping Cart 0 items - $0.00 0

భలే భలే మళ్ళీనోయ్….!!

హిట్టు కాంబోకున్న క్రేజే వేరు. అది మళ్లీ రిపీట్ అయితే .. బిజినెస్ పరంగా కూడా దానికి బోలెడంత అడ్వాంటేజ్ ఉంటుంది.  నానీ మారుతి కలయికలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్స్  లోనూ టాప్ హిట్టుగా నిలవడంతో పాటు .. డిస్ట్రిబ్యూటర్స్ నూ, ఎగ్జిబిటర్స్ నూ లాభాల్లో ముంచెత్తింది.  అందుకే ఇప్పుడు మళ్లీ నానీ మారుతి మరో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కే.యస్.రామారావు ఇటీవలే ఈ సినిమా ను కన్ఫార్మ్ చేశారు.  ‘భలే భలే మగాడివోయ్’ మూవీకి బాగా ఇంప్రెస్ అయిన కేయస్ .. వీరిద్దరి కాంబినేషన్ లోనూ ఒక   సినిమా నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన ప్రయత్నం ఫలించిందని వినికిడి.

అయితే ఈ సినిమా రావడానికి చాలా టైమ్ పట్టేట్టుంది. ప్రస్తుతం నానీ మారుతి కూడా ఇతర ప్రాజెక్ట్స్ తో బాగా బిజీగా ఉన్నారు.  ఒక పక్కన ఇంద్రగంటి ‘వీ’మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు  , మరోపక్క  శివ నిర్వాణ ‘టక్ జగదీష్’ మూవీని  కూడా లైన్ లో పెట్టుకున్నాడు. అలాగే.. రాహుల్ సాంకృత్యాయన్ తో ఒక మూవీకి కమిట్ అయ్యాడు. ఇక  మారుతి సైతం డివివి దానయ్య తనయుడ్నిహీరోగా లాంఛ్ చేసే బాధ్యతను తన భుజానికెత్తుకున్నాడు.  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మరో రెండు నెలలు టైమ్ పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నానీ మారుతి కలకయిలో సినిమా తెరకెక్కడం దాదాపు అసాధ్యం. మరి ఈ కాంబో ఎప్పటికి సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.   

Leave a comment

error: Content is protected !!