ఈ తరం తెలుగు సినిమాల్లో డైరెక్ట్ బూతులే వినిపిస్తున్నాయి. వాటిని సెన్సార్ వారు చూసి ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో అన్నట్టుగా .. అసలు అలాంటి డైలాగ్స్ ను కట్ చేయడమే మానేశారు. నేటి యూత్  కూడా వాటికి  బాగానే  కనెక్ట్ అవుతున్నారు . అయితే ఒకప్పుడు సినిమాల్లో .. ఒక డైలాగ్ లో ఒక్క బూతు మాట ధ్వనించినా సెన్సార్ సభ్యులు ఒప్పుకొనే వారు కాదు. అంతేకాదు.. ఆ మాట వేరే భాషలోని పదమైనా సరే.. వెంటనే కత్తెర కు పనిచెప్పేవారు. దానికి అక్కినేని ఆరాధన సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో నాగయ్య .. ఓరి భడవా అని మూడు సార్లు అంటారట. ఆ భడవా అన్న మాటను  సెన్సార్ వారు కట్ చేసేవరకూ ఊరుకో లేదట. నిర్మాతలు ఎంత చెప్పినా వినిపించుకోలేదట. ఇంతకీ భడవా అంటే.. ఉర్దూలో పింప్ అని అర్ధమని సెన్సార్ వారు ఆ నిర్మాతలకు తెలియజేశారట.  అదండీ.. నాటి సినిమాల సెన్సార్ రూల్స్ .

 

Leave a comment

error: Content is protected !!