కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్ తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. కొందరైతే… కరోనా వైరస్‌ను జయించేందుకు పాటల ద్వారా చైతన్య పరుస్తున్నారు . ప్రముఖ సంగీత దర్శకులు కోటి, కీరవాణి లాంటి ప్రముఖులు ఇప్పటికే తమ అవేర్ నెస్ సాంగ్స్ తో ఆకట్టుకున్నారు.
ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కూడా చేరబోతున్నారు. బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ రోల్ రైడర్ కంపోజ్ చేసిన బోర్ కొడుతోంది అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ మూడు సీజన్స్ లోనూ పోటీపడిన సభ్యులతో ఎవరింట్లో వారితో షూట్ చేసిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. రోల్ రైడర్ , తనుష్, గీతామాధురి, అమిత్ , దీప్తి, శ్యామల లాంటి పలువురు పార్టిసిపెంట్స్ ఈ పాట ద్వారా సందడి చేసి కరోనాపై అవగాహన కల్పించారు.
వీడియో సాంగ్ ను వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=zqxRylH_N8U&feature=youtu.be