ప్రస్తుతం ప్రపంచానికి ఒక్కటే సమస్య. కరోనా వైరస్. యావత్తు దేశాలన్నీ చిగురుటాకులా ఒణికిపోతున్న సమయాన..  ఇండియాలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు చాలా మంది రోజు కూలి కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ సమస్యకు పరిష్కారంగా.. టాలీవుడ్ లో కరోనా క్రైసిస్ చారిటీ అనే సంస్థను చిరంజీవి ఆధ్వర్యంలో స్థాపించగా.. పలువురు స్టార్ హీరోలు , సినీ ప్రముఖులు  తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అయితే బాలీవుడ్ లోనూ ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ సంస్థ పేరుతో పలువురు హీరోలు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ తన వంతు సాయాన్ని తాను చేయగా.. లిస్ట్ లోకి ఇప్పుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా చేరాడు.

అయితే సల్మాన్ ఖాన్ సాయం చేయబోతున్నది ఆ సంస్థ నుంచి కాదు.. తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా అతను గొప్ప సాయమే చేయబోతున్నాడు. హిందీ సినీ పరిశ్రమలో పని చేసే డైలీ వర్కర్లందరికీ ఆర్థిక సహాయం అందించబోతున్నాడు. 25 వేల మంది కళాకారులకు సల్మాన్ నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయనున్నాడు. ఈ మేరకు వారి అకౌంట్ల వివరాల లిస్టును సల్మాన్కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నంత కాలం సినీ కార్మికులెవ్వరూ తిండికి ఇతర అవసరాలకు బాధ పడాల్సిన పని లేదని.. వారిని తాను ఆదుకుంటానని సల్మాన్ ప్రకటించాడు. తాప్సీ పన్ను కరణ్ జోహార్ వంటి ప్రముఖులు సైతం సినీ కార్మకులకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 25 వేల మందికి ఆర్థిక సాయం అంటే సల్మాన్ వితరణ కోట్లల్లోనే ఉండబోతోంది. అక్షయ్ సల్మాన్లను చూసి మరింతమంది బాలీవుడ్ తారలు స్పందించే అవకాశముంది.

 

Leave a comment

error: Content is protected !!