మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మలిచిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, సీనియర్ నటీనటులు టబు, జయరామ్ అద్భుతమైన నటన ఈ సినిమా ఘన విజయానికి దోహదం చేశాయి. అందుకే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు అల్లు అరవింద్. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు తో కలిసి ఈ సినిమాను బాలీవుడ్ లో నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరబోతున్నాడట.

బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు త్రివిక్రమ్ స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేయబోతున్నాడని తెలుస్తోంది. బహుశా త్రివిక్రమ్ బాలీవుడ్ లో ఈ సినిమా తో దర్శకుడిగా కూడా పరిచయం కాబోతున్నాడని సమాచారం.  ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. ఇక బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్, తదితర నటీనటులు ఇంకా ఎంపికకాలేదు. త్వరలోనే కేస్టింగ్ ఎంపిక మొదలు పెట్టి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి హిందీ అల .. లో హీరో ఎవరో చూడాలి.

Leave a comment

error: Content is protected !!