ఫిదా, ఎఫ్ 2, గద్దలకొండ గణేశ్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు వరుణ్ తేజ. ఆ ఉత్సాహంతోనే..  తాజా గా  అతడు బాక్సర్ అవతారమెత్తుతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల వైజాగ్ లో బిగిన్ అయింది. ఇక అసలు మేటర్లోకొస్తే.. ఈ మూవీలో వరుణ్ తేజ కు విలన్ గా నవీన్ చంద్ర నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. బాక్సింగ్ ఛాంపియన్ అయిన వరుణ్ కు విలన్ అయిన నవీన్ చంద్ర నుంచి  అసలైన సవాల్ ఎదురవుతుందట.

త్రివిక్రమ్ ‘అరవింద సమేత వీరరాఘవ’లో బాల్ రెడ్డిగా నటించి మెప్పించాడు నవీన్ . ఇక   ధనుష్ తాజా చిత్రం  పటాస్ లో అయితే నవీన్ చంద్ర మెయిన్ విలన్ గా నటించి అదరగొట్టాడు. ఆ రిఫరెన్సులతోనే  నవీన్ చంద్రను ‘బాక్సర్’ లో పూర్తి స్థాయిలో విలన్ గా చూపించనున్నాడట కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి.  మరి బాక్సర్ లోని విలనిజం.. నవీన్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!