అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ .. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కలవారి కుటుంబంలో జన్మించిన శ్రీమంతుడిలా నటించి మెప్పించిన ఈ హీరోకి ఆ సినిమా మంచి బ్రేక్ నిచ్చింది. ఆ క్రెడిట్ తోనే సుశాంత్ ప్రస్తుతం హీరోగా ఒక మూవీలో నటిస్తున్నాడు. సినిమా పేరు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.
కొద్దిరోజుల క్రితమే గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ మూవీ .. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సుశాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు మేకర్స్. సుశాంత్ బైక్ మీదనుంచి స్టైల్ గా దిగి.. దానికి హెల్మెట్ తగిలించి.. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే బోర్ట్ ఉన్న ఒక గ్యారేజ్ లోకి వెళ్ళడం.. ఆపై కొన్ని ఛేజ్ లతో వీడియో రిలీజైంది. ఆల్ స్టూడియోస్ అండ్ శాస్త్రా బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ మూవీకి దర్శకుడు యస్.దర్శన్. మరి ఈ మూవీ సుశాంత్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
వీడియో వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.