Shopping Cart 0 items - $0.00 0

ఫామ్ లోకొచ్చేశారు..

 

 

ఒక్క హిట్టు పది ఫ్లాపులకు సమాధానం చెబుతుంది. ఇక ఆ సినిమా కానీ సూపర్ హిట్టయితే.. దాని ఎఫెక్ట్ ఆయా హీరోల తదుపరి చిత్రాలకు అడ్వాంటేజ్ గా మారుతుందని   వేరే చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం  ఓ ముగ్గురు యంగ్ హీరోలు .. చాన్నాళ్ళకు మంచి విజయం నమోదు చేసుకొని జోరు మీదున్నారు. ఎప్పుడో త్రివిక్రమ్ అఆ సినిమాతో రూ. 50కోట్ల క్లబ్ లోకి చేరిన నితిన్ .. ఆ తర్వాత వచ్చిన ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలతో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నితిన్.. రీసెంట్ గా ‘భీష్మ’ చిత్రంతో  బ్లాక్ బస్టర్ కొట్టి.. ఫామ్ లోకి వచ్చేశాడు.

ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో హీరో నిఖిల్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో నాలుగేళ్ళ క్రితం హిట్టు అందుకున్న నిఖిల్ కు ఆ తర్వాత ‘కేశవ, కిరాక్ పార్టీ’ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అలాంటి ఈ హీరో లేటెస్ట్ గా ‘అర్జున్ సురవరం’ మూవీతో డీసెంట్ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు. ‘కనిదన్’ తమిళ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగానే థ్రిల్ చేసింది. ఇక లాస్ట్ బట్ ..నాట్ లీస్ట్ . ‘అశ్వథ్ధామ’ చిత్రంతో నాగశౌర్య కూడా సూపర్ హిట్టందుకున్నాడు. ‘ఛలో’ మూవీతో మంచి సక్సెస్ చవిచూసిన అతడు.. ఆ తర్వాత వచ్చిన ‘కణం, అమ్మమ్మగారిల్లు, నర్తన శాల’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాడు. ఆ తర్వాత ‘ఓ బేబీ’ మూవీ వచ్చినా.. ఆ హిట్టు సమంతా ఖాతాలోకి వెళ్లిపోయింది. సో.. మొత్తానికి అలా.. ఈ ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు .. రీసెంట్ మూవీస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.

Leave a comment

error: Content is protected !!