విజిల్’ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక ఇన్నోవేటివ్ స్టోరీతో తెరకెక్కుతుండగా..  విజయ్ మునుపెన్నడూ నటించని ఒక మాస్ పాత్రను పోషిస్తోన్నాడు.  ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతోంది. ఏప్రిల్ 9న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మాస్టర్ చిత్రానికి సంబంధించిన ప్రచారాల్ని మొదలు పెట్టారు మేకర్స్. ముఖ్యంగా ఇంతవరకూ తెలుగులో ఈ సినిమాఫస్ట్ లుక్ విడుదల కాలేదు. అందుకే  రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

తలపట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తోన్న విజయ్ లుక్ తో విడుదలైన ‘మాస్టర్’ పస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మాళవికా మోహనన్ , ఆండ్రియా కథానాయికలు గా నటిస్తున్నారు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తోన్న మాస్టర్ చిత్రం ఏ స్థాయిలో విజయాన్నిఅందుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!