Shopping Cart 0 items - $0.00 0

ఫస్ట్ లుక్ : విజయ్ సేతుపతి ‘ఉప్పెన’

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘ఉప్పెన’ .  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త  నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చెట్టుమీద కాయకి, సముద్రంలో ఉప్పుకి మధ్యనున్న బంధమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక ఇందులో రాయనం అనే పవర్ ఫుల్ విలన్ పాత్రతో తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తొలిసారిగా టాలీవుడ్ తెరమీద ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమాలోని  ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ఈ రోజే విడుదల చేశారు మేకర్స్. సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో  ఖద్దరు చొక్కాలో విజయ్ సేతుపతి  కారు కు స్టైల్ గా ఆనుకొని సీరియస్ గా చూస్తోన్న లుక్ ఒకటి , సిగరెట్ కాలుస్తోన్న మరో లుక్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Leave a comment

error: Content is protected !!