లాస్టియర్ ఎవరు చిత్రంతో టాలీవుడ్ జనాన్ని భలేగా థ్రిల్ చేసిన రెజీనా కసండ్రా  ఈ ఏడాది కోలీవుడ్ జనానికి ఓ హారర్ చిత్రంతో థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. సినిమా పేరు సూర్ఫణగై. రాముడంతటివాడిని మోహించి.. లక్ష్మణుడి ఆగ్రహానికి గురై.. అతడి చేత ముక్కు చెవులు కోయించుకొన్న..  రావణాసురుడి సోదరి పేరు తో వస్తోన్న ఈ వైవిథ్యమైన ద్విభాషా చిత్రం తెలుగులో నేనా నా? పేరుతో విడుదలకానుంది. కార్తిక్ రాజు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా విడుదల చేశారు మేకర్స్. రెజీనా స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సమ్మర్ కానుకగా విడుదల కానున్న నేనా నా ? చిత్రం రెజీనా కు చాలా ప్రత్యేకమైంది గా నిలిచిపోతుందని అంటున్నారు మేకర్స్. మరి ఈ సినిమా రెజినాకు ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!