యంగ్ హీరో రాజ్ తరుణ్ సరైన హిట్టుకొట్లి చాలా రోజులైపోతోంది. ఎప్పుడో ‘కుమారి 21 ఎఫ్’ తో మాత్రమే సాలిడ్ హిట్టు దక్కించుకున్న మనోడి కెరీర్ ఆ తర్వాత ఎన్నో కుదుపులకు లోనవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ హీరో దృష్టి ఒకే ఒక సినిమా మీద కేంద్రీకృతమై ఉంది. అదే అతడి హోప్ కూడా. సినిమా పేరు ‘ఓరేయ్ బుజ్జిగా’. ‘గుండెజారి గల్లంతైందే’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదిక గా రీలీజ్ చేశారు నిర్మాతలు. ఇటీవలే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ‘ఓరేయ్ బుజ్జిగా’ మూవీ ఈ సమ్మర్ లో విడుదల కానుంది.

‘ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే’ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నమల్లూ కుట్టి మళవికా నాయర్ ఈ సినిమాలో కథానాయిక.  ఇందులో ఆమె కేరెక్టర్ చాలా రెబల్ గానూ, చెలాకీగానూ ఉంటుందని ఫస్ట్ లుక్ ను చూస్తే అర్దమవుతోంది. ఇక ఒకప్పటి అందాల కథానాయిక వాణీ విశ్వనాథ్  ఈ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూండడం విశేషం. మరి ఒరేయ్ బుజ్జిగా మూవీతో రాజ్ తరుణ్, దర్శకుడుకొండా విజయ్ కుమార్ తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూద్దాం.

Leave a comment

error: Content is protected !!