డిఫరెంట్ టైపాఫ్ మూవీస్ తో అలరించే  దర్శకుడు రవిబాబు కొంతకాలంగా..  హారర్ మూవీస్ మీదే దృష్టి పెడుతోన్న కారణంగా .  పలుచిత్రాలు పరాజయం పాలయ్యాయి.  అతడి ఎర్లియర్ మూవీ ‘ఆవిరి’. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో .. ఇప్పుడు ఈ డైరెక్టర్ మళ్ళీ కామెడీ జోనర్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యాన్ని కామెడీ వేలో ప్రజెంట్ చేస్తూ.. ‘క్రష్’ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఆ సందర్బంగా.. ‘క్రష్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జిమ్ లో ఒకమ్మాయి మాస్క్ వేసుకొని త్రెడ్ మిల్ మీద ఎక్స్ సైజ్ చేస్తుంటే.. ఆ పక్కనే  ఉన్న త్రెడ్ మిల్స్ పై కొంతమంది కుర్రోళ్ళు ఆమె ను చూడడం ఒక లుక్ గా విడుదలైతే..  ఒక అమ్మాయి , అబ్బాయి మాస్కులేసుకొని ముద్దు పెట్టుకున్నట్టు ఉండే మరో లుక్ ను విడుదల చేశారు మేకర్స్.  ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న కరోనా వైరస్ కథా చిత్రమైన ‘క్రష్’ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!