రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ను మలుపుతిప్పిన మాస్ యాక్షన్ చిత్రం ‘ఛత్రపతి’. దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ లో నాలుగో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టై.. దాదాపు రూ. 30కోట్లు వసూళ్ళు రాబట్టింది. పేరుకి యాక్షన్ మూవీనే అయినా.. ఇందులో మదర్ సెంటిమెంట్ ను చాలా ఎక్కువ మోతాదులో ఆవిష్కరించాడు దర్శకుడు. శ్రియా శరణ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భానుప్రియ అనితర సాధ్యమైన నటన తో మెప్పించగా , విలన్ గా ప్రదీప్ రావత్ క్రూయాల్టీ , సుప్రీత్ రెడ్డి, నరేంద్ర ఝా  విలనిజంగా బాగా ఎలివేట్ అయ్యాయి. ఇంకా అజయ్, కమల్ కామరాజు, జయ ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖర్, కోట శ్రీనివాసరావు , షఫీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 2005, సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

పార్వతికి అశోక్ సొంతకొడుకు, శివాజీ సవతి కొడుకు . అయినప్పటికీ ఇద్దరినీ సమానంగా ఆదరిస్తుంది. ప్రేమానురాగాలు పంచుతుంది. అది అశోక్ కు నచ్చదు. దానికి కారణంగా అతడు శివాజీమీద పగ పెంచుకుంటాడు. ఇంత లో శ్రీలంకలో ఉంటున్నవారి కుటుంబం శరణార్ధులుగా వైజాగ్ పోర్ట్ కు తరలించబడతారు. ఆ తల్లి శివాజీకి దూరమువుతుంది. అశోక్ దగ్గరే ఉంటూ.. అన్నను వెతికిస్తూ ఉంటుంది.  ఆ క్రమంలో  ఆ పోర్ట్ ఏరియాలో.. అక్రమాలు, అరాచకాల వల్ల  శివాజీ బృందానికి కష్టంగా మారుతుంది. దాంతో శివాజీ వారి మీద ఎదురుతిరిగి.. ఆ పోర్ట్ ఏరియాకి ఛత్రపతిగా మారతాడు. చివరికి అతడు తన తల్లిని, తమ్ముడ్ని ఎలా కలుసుకున్నాడు అనేదే మిగతా కథ. కీరవాణి అద్భుత సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు జనరంజకం అయ్యాయి.

 

Leave a comment

error: Content is protected !!