మ‌హామ్మారి కరోనా పై యావ‌త్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మ‌న దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా నివార‌ణ‌కు అన్ని విధాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమైత‌న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు, పోలీస్ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది పొంచి ఉన్న ప్ర‌మాదాన్ని లెక్క చేయ‌కుండా మ‌నంద‌రి కోసం పని చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కుటుంబాల్ని వదిలిపెట్టి రోడ్లమీదే తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా.. ప్రజల కోసం కష్టపడుతోన్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.

కొవిడ్‌-19పై మన దేశం చేస్తున్న యుద్ధంలో అహర్నిశలు కష్టపడుతోన్న తెలంగాణ పోలీసు యంత్రాంగానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కోసం నిర్విరామంగా వారు అందిస్తున్న సేవలు అసాధారణమైనవి. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రాణాలతోపాటు, మన కుటుంబసభ్యుల జీవితాలను కాపాడుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు. మనదేశం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ నిస్వార్థమైన అంకితభావానికి సెల్యూట్‌ చేస్తున్నాను’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

 

Leave a comment

error: Content is protected !!