Shopping Cart 0 items - $0.00 0

పెళ్ళాం ఊరెళితే

 

కుటుంబ ప్రేక్షకుల్ని తన సినిమాలతో థియేటర్స్ కు రప్పించే ప్రతిభావంతమైన దర్శకుడు యస్వీ.కృష్ణారెడ్డి. ఆ జోనర్నే తన ప్రధాన బలంగా చేసుకున్న ఆయన డైరెక్టోరియల్ వెంచర్ లో మరో సూపర్ హిట్టు చిత్రం 2003లో వచ్చిన ‘పెళ్ళాం ఊరెళితే’. శ్రీకాంత్ , వేణు, సంగీత, రక్షిత ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాను సిరీ మీడియా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో అలరించింది. భార్యా భర్తల అన్యోన్యాన్ని అనుమానం అనే పెనుభూతం పట్టిపీడిస్తే .. పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియచెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. నిజానికి ‘చార్లీచాప్లిన్’ అనే తమిళ చిత్రానికి రీమేక్. ఆ తర్వాత ఇదే మూవీ మలయాళంలో ‘హ్యాపీ హజ్బెండ్స్’ గానూ, కన్నడలో ‘కళ్ళ మళ్ళ సుళ్ళ’ గానూ, హిందీలో నో ఎంట్రీ గానూ, మరాఠీలో ‘నో ఎంట్రీ పుదే దోఖా ఆయే’ గానూ. బెంగాలీలో ‘కెలోర్ క్రితి’ గానూ రీమేక్ అయి .. 6 భాషల్లో రీమేక్ అయిన మొదటి దక్షిణాది చిత్రంగా చరిత్రకెక్కింది. అయితే ఈ సినిమా కథాంశంలోని మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. వాస్తవానికి ఇది 1975 లో తమిళ లో వచ్చిన ‘యారుక్కు మాపిళ్ళై యారో’ చిత్రం అవడం విశేషం. ఇదే కథాంశాన్ని బేస్ చేసుకొని 1998లో తెలుగులో రాజేంద్రప్రసాద్ , రోజా జంటగా ముత్యాల రాందాసు ‘మీ ఆయన జాగ్రత్త’ గా రీమేక్ చేశాడు.

Leave a comment

error: Content is protected !!