Shopping Cart 0 items - $0.00 0

పెద్దరికం

విలక్షణ నటుడు జగపతి బాబు కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ‘పెద్దరికం’. రెండు కుటుంబాల మధ్య రగిలే పగ.. చిన్నవాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చాటిచెప్పే ఒక వైవిధ్యమైన కథతో ఏ.యం.రత్నం స్వీయ దర్శకత్వంలో 1992లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. అయితే ఈ సినిమా 1991 లో మలయాళంలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన .. సిద్ధిక్ లాల్ ద్వయం మలిచిన ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి రీమేక్ అవడం విశేషం. ప్రముఖ మలయాళ నాటకరంగ కళాకారుడు యన్.యన్.పిళ్ళై మలయాళ, తెలుగు వెర్షన్స్ లో ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగే మలయాళ విలక్షణ నటీమణి ఫిలోమినా పోషించిన మరో పవర్ ఫుల్ పాత్ర ఆనప్పర అచ్చమ్మ పాత్రను తెలుగు లో బసవపున్నమ్మగా భానుమతి రామకృష్ణ అంతకన్నా ప్రతిభావంతంగా పోషించి రక్తి కట్టించారు. ఇక ఇదే సినిమాను ప్రియదర్శన్ బాలీవుడ్ లో హల్ చల్ గా తెరకెక్కించగా… కన్నడలో ‘పాండవరు’గా రీమేక్ అయింది.

Leave a comment

error: Content is protected !!