మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈనెల 27న రానుంది. ప్రతీ సంవత్సరం పుట్టిన రోజు వేడుకను తన అభిమానుల సమక్షంలో జరుపుకొనే అతగాడు ఈ ఏడాది మాత్రం తన పుట్టిన రోజును విరమించుకోమని అభిమానులకు విన్నవించాడు. కరోనా ఔట్ బ్రేక్ చాలా తీవ్రంగా ఉన్న  ఈ పరిస్థితుల్లో జన సమూహాన్ని ఎంకరేజ్ చేయొద్దని పిలుపునిచ్చాడు. ఆ అభ్యర్ధనను  ఒక ప్రెస్ మీట్ రూపంలో విడుదల చేశాడు.

తన పుట్టిన రోజును  జరిపే బదులు .. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. తగిన జాగ్రత్తల్ని తీసుకోమని ..వారికి అర్ధమయయే రీతిలో వివరించి మీ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తే అదే నాకు ఈ సంవత్సరం మీరిచ్చే అతి పెద్ద కానుకని రామ్ చరణ్ ప్రెస్  నోట్లో తెలియచేశాడు. దాంతో రామ్ చరణ్ కు సమాజం పట్ల ఉన్న సామాజిక బాధ్యతను పలువురు ప్రశంసిస్తున్నారు. 

 

Leave a comment

error: Content is protected !!